Telugu Lyrics

Madhura Nagarilo Lyrics - Pelli SandaD Movie Song

మధురా నగరిలో పాట సాహిత్యం - పెళ్లి సందడి

మధురా నగరిలో.. యమునా తటిలో

మురళీ స్వరములే.. ముసిరిన యెదలో

కురిసెనంట మురిపాల వాన..

లయలై.. హొయలై.. జలజల జతులై

గలగల గతులై..

వలపుల శ్రుతులై ..వయసుల ఆత్రుతలై

దొరక్క దొరక్క దొరికింది..

తలుక్కు చిలక ఇదీ

పలక్క పలక్క పలికేస్తూ..

ఝలక్కు విసిరినది

రెండు కళ్ళల్లొ కళ్ళు పెట్టి.. కౌగిల్ల ఇల్లు కట్టి

నచ్చావు నువ్వు అన్నది

గుండె గుమ్మంలొ కాలు పెట్టి.. గుట్టంత బైటపెట్టి

గుర్తుంచుకోమన్నది

మధురా నగరిలో..

మధురా నగరిలో.. యమునా తటిలో

మురళీ స్వరములే.. ముసిరిన యెదలో

చెంతకొచ్చెయ్యగానే..

చెమక్కు చెమక్కు.. చురుక్కు చురుక్కు

చటుక్కు చటుక్కు.. చిటుక్కులే

చెయ్యి పట్టెయ్యగానే..

తడక్కు తడక్కు.. దినక్కు దినక్కు

ఉడుక్కు ఉడుక్కు.. దుడుక్కులే

నువ్వు లేక చందమామ చిన్నబోయే

నిన్ను చేరి వెన్నెలంత వెల్లువాయే

నువ్వు రాక మల్లెపూలు తెల్లబోయే

నిన్ను తాకి పూల గుండు తేలికాయే

ఈ మాటకే.. ఈ రోజుకే.. ఇన్నాళ్లు వేచానే

దొరక్క దొరక్క దొరికింది..

తలుక్కు చిలక ఇదీ

పలక్క పలక్క పలికేస్తూ..

ఝలక్కు విసిరినది

రెండు కళ్ళల్లొ కళ్ళు పెట్టి.. కౌగిల్ల ఇల్లు కట్టి

నచ్చావు నువ్వు అన్నది

గుండె గుమ్మంలొ కాలు పెట్టి.. గుట్టంత బైటపెట్టి

గుర్తుంచుకోమన్నది

మధురా నగరిలో..

మధురా నగరిలో.. యమునా తటిలో

మురళీ స్వరములే.. ముసిరిన యెదలో

More from Pelli SandaD

All songs from Pelli SandaD

More by Kaala Bhairava

All songs by Kaala Bhairava