Eeswarude Lyrics - Bimbisara Movie Song
ఈశ్వరుడే పాట సాహిత్యం - బింబిసార
భువిపై ఎవడు.. కని విని ఎరగని.. అద్భుతమే జరిగెనే
భువిపై ఎవడు.. కని విని ఎరగని.. అద్భుతమే జరిగెనే
దివిలో సైతం.. కథగా రాని..
విధి లీలే వెలిగెనే
నీకు నువ్వే దేవుడన్నా
భావనంతా గతమున కథే
నిన్ను మించే రక్కసులుండే
నిన్ను ముంచే లోకం ఇదే
యే కాలమో.. విసిరిందిలే..
నీ పొగరు తలకు తగిన వలయమే
ఈశ్వరుడే.. ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే.. సాక్ష్యమిదే.. బిక్షువయ్యె బింబిసారుడే
ఈశ్వరుడే.. ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే.. సాక్ష్యమిదే.. బిక్షువయ్యె బింబిసారుడే
రాజభోగపు లాలస బ్రతుకే..
మట్టి వాసన రుచి చూసినదే
రాజభోగపు లాలస బ్రతుకే..
మట్టి వాసన రుచి చూసినదే
రక్త దాహం మరిగిన మనసే..
గుక్క నీళ్ళకు పడి వేచినదే
యేది ధర్మం.. యేది న్యాయం..
తేల్చువాడొక్కడున్నాడులే
లెక్క తీసి.. శిక్ష రాసే..
కర్మఫలమే ఒకటుందిలే
యే జన్మలో.. యే జన్మలో.. నీ పాపమో
ఆ జన్మలోనె పాప ఫలితమే
ఈశ్వరుడే.. ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే.. సాక్ష్యమిదే.. బిక్షువయ్యె బింబిసారుడే
నరకమిచ్చిన నరకుడి వధతో..
దీప పండుగ మొదలయ్యినదే
నరకమిచ్చిన నరకుడి వధతో..
దీప పండుగ మొదలయ్యినదే
నీతి మరచిన రావణ కథతో..
కొత్త చరితే చిగురించినదే
రాక్షసుడివో.. రక్షకుడివో..
అంతుతేలని ప్రశ్నవి నువ్వే
వెలుగు పంచే కిరణమల్లే..
ఎదుగుతావో తెలియని కలే
యే క్షణం.. యే క్షణం.. యే వైపుగా..
అడుగేయనుందొ నీ ప్రయాణమే
ఈశ్వరుడే.. ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే.. సాక్ష్యమిదే.. బిక్షువయ్యె బింబిసారుడే
ఈశ్వరుడే.. ఈశ్వరుడే.. చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే.. సాక్ష్యమిదే.. బిక్షువయ్యె బింబిసారుడే
More from Bimbisara
All songs from Bimbisara →More by Kaala Bhairava
Mr. Majnu - Naalo Neeku Song - Lyrics
Mr. Majnu - Naalo Neeku Song - Lyrics
Mr. Majnu · 2019
Madhura Nagarilo Lyrics - Pelli SandaD Movie Song
మధురా నగరిలో పాట సాహిత్యం - పెళ్లి సందడి
Pelli SandaD · 2021
Jersey - Spirit Of Jersey Song - Lyrics
Jersey - Spirit Of Jersey Song - Lyrics
Jersey · 2019
Naatu Naatu Lyrics - RRR Movie Song
నాటు నాటు పాట సాహిత్యం - ఆర్ఆర్ఆర్ చిత్రం
RRR · 2021
Dear Comrade - Yetu Pone Song - Lyrics
Dear Comrade - Yetu Pone Song - Lyrics
Dear Comrade · 2019