Telugu Lyrics

Oo Aadapilla Lyrics - Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Song

ఓ ఆడపిల్లా పాట సాహిత్యం - అశోకవనంలో అర్జున కళ్యాణం

మాట రాని మాయవా.. మాయజేయు మాటవా

మాటులోని మల్లెవా.. మల్లె మాటు ముళ్ళువా

వయ్యారివా.. కయ్యారివా.. సింగారివా.. సింగానివా

రాయంచవా.. రాకసివా.. లే మంచులో లావా నీవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా

నా జీవితంతో ఆటాడుతావా

ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా

నా జీవితంతో ఆటాడుతావా

బుజ్జి బుజ్జి బుగ్గల్లఒనా ఎరుపుని.. కనుల పులిమావా

చిట్టి చిట్టి చెక్కిల్లలో నునుపుని.. నుదుటికియలేవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా

నా జీవితంతో ఆటాడుతావా

పది మంది చూస్తు ఉంటే.. అడెడే అమయకంగా

ఒకరైన లేకపోతే.. అయ్యయ్యో మరో రకంగా

ఉంటూ.. నా యెదనే.. తింటూ.. ఈ కథనే

సందేహంలో పడదోయ్‌కే

ఏంటో నీ ఇబ్బంది.. చెప్పేయ్ ఏమౌతోంది..

అట్ట అట్ట ఎళ్ళిపోకే

తిక్కో తెక్కో చిక్కో చుక్కో..

అసలేదో ఒలిచి చెబుతావా

పట్టో బెట్టో గుట్టో కట్టో

నిజమేదో చెవిన పడనీవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా

నీతోటి స్నేహం.. సచ్చేటి సావా

బతిమాలడానికైనా.. ఇదిగో తయారుగున్నా

బదులియ్యి నేటికైనా.. బతికీ ఏదో విధానా

తాకే ఆ తెరపై.. దూకే ఓ మెరుపై..

నాకై.. నవ్వే విసిరావే

తీరా.. నీ ముందుంటే.. తీరేలా పొమ్మంటూ

తీరం దాచి తిరిగావే

తప్పో ఒప్పో గొప్పో ముప్పో తెలుపక.. లొసుగులెడతావా

మంచో చెడ్డో కచ్చో పిచ్చో.. తెలియక

నసిగి నడిచేవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా

సంద్రాలనైనా ముంచేటి నావా

More by Ram Miriyala

All songs by Ram Miriyala