Telugu Lyrics

O Na Deveri Lyrics - Iravatham Movie Song

ఓ నా దేవేరీ పాట సాహిత్యం - ఐరావతం

యు వన్న బీ..

యు వన్న బీ..

యు వన్న బీ..

యు వన్న బీ..

నీకు నేనై.. నాకు నీవై.. ఓ సాథియా

నువ్వు నాకూ.. అద్దమల్లే.. ఓ యారియా

వడబోసి గాలినంతా.. వలవేసి పట్టుకుంటా

కలబోసి అందమంతా.. విలువిచ్చి అందుకుంటా

కామాలు లేని వీలునామ.. నీకు రాసుకుంటా

దేవేరీ.. ఓ నా దేవేరీ

గడియకొక్కసారి.. యెక్కిలు నీవె పోరి

యే కాలమానమంటు లేదు.. ప్రేమ కాగితానా

దేవేరీ.. ఓ దేవేరీ

రెండంటె రెండు కళ్ళు.. కలలేమొ సంతకాలూ

గురుతున్న ఓనమాలు.. తెలిపాయి ఆనవాలు

నీలోను నాలోను.. పదిలం కదా

అలపైన తేలిగాలి.. సంద్రాన్ని మోసుకెళ్ళి

అలపైన తేలిగాలి.. సంద్రాన్ని మోసుకెళ్ళి

చినుకల్ల మారి దూకేస్తుందే..

దేవేరీ.. ఓ నా దేవేరీ

ఆహా దేవేరీ.. ఓ నా దేవేరీ

ఓ సారి చూస్తె చాలు.. కన్నుల్లో కార్నివాలు

వయ్యారి సోయగాలు.. ఒంపుల్లొ పారె నైలు

ఉయ్యాలె ఊగింది.. ఆ నడకలో

గుండెల్లొ యేటవాలు.. కురిసాయి రైన్‌బోలు

గుండెల్లొ యేటవాలు.. కురిసాయి రైన్‌బోలు

రంగుల్లొ నన్ను ముంచేస్తుందే..

దేవేరీ.. ఓ నా దేవేరీ

ఆహా దేవేరీ.. ఓ నా దేవేరీ

More by Ram Miryala

All songs by Ram Miryala