Telugu Lyrics

Kalyanam Lyrics - Pushpaka Vimanam Movie Song

కళ్యాణం పాట సాహిత్యం - పుష్పక విమానం

అమ్మలాలో.. పైడి కొమ్మలాలో

ముద్దుల గుమ్మలాలో

సందళ్ళు నింపారే పందిళ్లల్లో

బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో

సాగేటి సంబరాలో

కోయిలాలో రామ సిలకలాలో

పలకండి మంతరాలొ

కళ్యాణం కమనీయం

ఒకటయ్యే.. వేళనా వైభోగం

కళ్యాణం కమనీయం

ఈ రెండు మనసులే రమణీయం

మూడే ముళ్లటా.. ముడి పడుతుంటె ముచ్చటా

నాలుగు దిక్కుల కంటా..

చూడ ముచ్చటైన వేడుకంటా

ఆ పంచ భూతాల తోడుగా..

ప్రేమ పంచుకొనే పండగంటా

ఆరారు కాలాల నిండుగా..

ఇది నూరేళ్ళ పచ్చని పంట

అమ్మలాలో.. పైడి కొమ్మలాలో

ముద్దుల గుమ్మలాలో

ఇంటి పేరు మారె ఈ తంతులో

చుక్కలె అక్షింతలో

మోగేటి సన్నాయి మోతల్లలో

సాగేటి సంబరాలో

పలకరించె.. తడి ఓ లీలలో

పుట్టినింట కళ్ళలో

యేడడుగులెయగ ఈ అగ్ని మీకు సాక్షిగా

యేడు జన్మల బంధంగా

యెనిమిది గడప దాటి.. ఆనందాలు చూడగా..

నీ అనుబంధమే బలపడగా

ఇక తొమ్మిది నిండితె నెలా

నెమ్మ నెమ్మదిగ తీర కలా

పది అంకెల్లొ సంసారమిలా

పదిలంగ సాగేటి అలా

ఒకటయ్యేనంట ప్రాణం

ఒకరంటే.. ఇంకొకరి లోకం

ఇద్దరు చెరో సగం.. ఇక ఇద్దరిదంట కష్టం సుఖం

అమ్మలాలో.. పైడి కొమ్మలాలో

ముద్దుల గుమ్మలాలో

సందళ్ళు నింపారే పందిళ్లల్లో

బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో

సాగేటి సంబరాలో

కోయిలాలో రామ సిలకలాలో

పలకండి మంతరాలొ

అమ్మలాలో.. పైడి కొమ్మలాలో

ముద్దుల గుమ్మలాలో

సందళ్ళు నింపారే పందిళ్లల్లో

బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో

సాగేటి సంబరాలో

కోయిలాలో రామ సిలకలాలో

పలకండి మంతరాలొ

More by Sid Sriram

All songs by Sid Sriram