Telugu Lyrics

Vennelalone Vedi Lyrics - Pellinati Pramanalu Movie Song

వెన్నెలలోనె వేడి ఏలనో పాట సాహిత్యం - పెళ్లినాటి ప్రమాణాలు

వెన్నెలలోనే వేడి ఏలనో.. వేడిమిలోనే చల్లనేలనో

ఏమాయె ఏమో జాబిలీ.. ఈమాయ ఏమో జాబిలీ

వెన్నెలలోనే విరహమేలనో..  విరహములోనే హాయిఏలనో

ఏమాయె ఏమో జాబిలి.. ఈమాయ ఏమో జాబిలి

మొన్నటికన్నా.. నిన్న వింతగ

నిన్నటికన్నా.. నేడు వింతగ

మొన్నటికన్నా.. నిన్న వింతగ

నిన్నటికన్నా.. నేడు వింతగ

నీ సొగసూ.. నీ వగలూ..  హాయిహాయిగా వెలసేనే

వెన్నెలలోనే వేడి ఏలనో.. వేడిమిలోనే చల్లనేలనో

ఏమాయె ఏమో జాబిలీ.. ఈమాయ ఏమో జాబిలీ

రూపముకన్నా.. చూపుచల్లగా

చూపులకన్నా.. చెలిమి కొల్లగా

నీ కళలూ.. నీ హొయలూ..  చల్లచల్లగా విరిసేనే

వెన్నెలలోనే హాయి ఏలనో.. వెన్నెలలోనే విరహమేలనో..

ఏమాయె ఏమో జాబిలీ.. ఈమాయ ఏమో జాబిలీ

More by Ghantasala

All songs by Ghantasala