Telugu Lyrics

Urumulu Nee Muvvalai Lyrics - Chandralekha Movie Song

ఉరుములు నీ మువ్వలై పాట సాహిత్యం - చంద్రలేఖ

ఉరుములు నీ మువ్వలై.. మెరుపులు నీ నవ్వులై

తొలకరి మేఘానివై.. రా అలివేణీ

పరుగులు నీ గానమై.. తరగలు నీ తాళమై

చిలిపిగా చిందాడవే.. కిన్నెరసాని

కాలానికే.. కాలాడకా.. ఆగాలి.. నువ్వు ఆడే వేళ

అది చూడగా.. మనసాగకా.. ఆడాలి నీతో.. నింగి నేలా

తకధిమి తాళాలపై.. తళుకుల తరంగమై

చిలిపిగా చిందాడవే.. కిన్నెరసాని

మెలికల మందాకిని.. కులుకుల బృందావని

కనులకు వింధియ్యవే.. ఆ అందాన్ని

చంద్రుల్లో కుందేలే.. మా ఇంట ఉందంటూ

మురిసింది.. ఈ ముంగిలీ

చిందాడే కిరణంలా.. మా ముందు నువ్వుంటే

ప్రతిపూట దీపావళీ

మా కళ్ళలో.. వెలిగించవే సిరివెన్నెలా

మా ఆశలే.. నీ అందెలై..

ఈ మంచు మౌనం.. మోగే వేలా

ఆ సందడే.. ఆనందమై..

ప్రేమించు ప్రాణం.. పాడే వేల

ఉరుములు నీ మువ్వలై.. మెరుపులు నీ నవ్వులై

తొలకరి మేఘానివై.. రా కళ్యాణీ

తకధిమి తాళాలపై.. తళుకుల తరంగమై

చిలిపిగా చిందాడవే.. కిన్నెరసాని

నడయాడే.. నీ పాదం.. నటవేదమేనంటూ

ఈ పుడమే.. పులకించగా

నీ పెదవే తన కోసం.. అణువైన కొలువంటూ

సంగీతం.. నిను చేరగా

మా గుండెనే.. శృతి చేయవా.. నీ వీణలా

ఏ గాలిలో.. నీ కేలితో.. రాగాలు ఎన్నో.. రేగే వేళా

నీ మేణిలో.. హరివిల్లునే.. వర్ణాల వాగై సాగే వేళా

ఉరుములు నీ మువ్వలై.. మెరుపులు నీ నవ్వులై

తొలకరి మేఘానివై.. రా అలివేణీ

తకధిమి తాళాలపై.. తళుకుల తరంగమై

చిలిపిగా చిందాడవే.. కిన్నెరసాని

More by Rajesh Krishnan

All songs by Rajesh Krishnan