Telugu Lyrics

టకిట తథిమి పాట సాహిత్యం - సాగర సంగమం

టకిట తథిమి తకిట తథిమి తందానా

హృదయలయల జతుల గతుల తిల్లానా

టకిట తథిమి తకిట తథిమి తందానా

హృదయలయల జతుల గతుల తిల్లానా

తడబడు అడుగుల తప్పని తాళానా

తడిసిన పెదవుల రేగిన రాగానా

తడబడు అడుగుల తప్పని తాళానా

తడిసిన పెదవుల రేగిన రాగానా

శృతిని లయని ఒకటి చేసి

టకిట తథిమి తకిట తథిమి తందానా

హృదయలయల జతుల గతుల తిల్లానా

టకిట తథిమి తకిట తథిమి తందానా

హృదయలయల జతుల గతుల తిల్లానా

నరుడి బ్రతుకు నటనా

ఈశ్వరుడి తలపు ఘటనా

ఆ రెంటి నట్ట నడుమా నీకెందుకింత తపనా

నరుడి బ్రతుకు నటనా

ఈశ్వరుడి తలపు ఘటనా

ఆ రెంటి నట్ట నడుమా నీకెందుకింత తపనా

తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా

తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా

తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా

తెలిసీ తెలియని ఆశల లలలా లలలా

ఏటిలోని అలలవంటి

కంటిలోని కలలు కదిపి

గుండె అలను అందియలుగ చేసీ

టకిట తథిమి తకిట తథిమి తందానా

హృదయలయల జతుల గతుల తిల్లానా

టకిట తథిమి తకిట తథిమి తందానా

హృదయలయల జతుల గతుల తిల్లానా

తడబడు అడుగుల తప్పని తాళానా

తడిసిన పెదవుల రేగిన రాగానా

తడబడు అడుగుల తప్పని తాళానా

తడిసిన పెదవుల రేగిన రాగానా

శృతిని లయని ఒకటి చేసి

టకిట తథిమి తకిట తథిమి తందానా

హృదయలయల జతుల గతుల తిల్లానా

పలుకరాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం

సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం

పలుకరాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం

సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం

అలలులు కురియగ నాడినదే అలకల కులుకుల అలమేల్మంగా

అలలులు కురియగ నాడినదే అలకల కులుకుల అలమేల్మంగా

అన్న అన్నమయ్య మాట

అచ్చ తేనే తెనుగు పాట

పల్లవించు పద కవితలు పాడీ

More from Sagara Sangamam

All songs from Sagara Sangamam

More by S. P. Balasubrahmanyam

All songs by S. P. Balasubrahmanyam