Telugu Lyrics

Ori Vaari Lyrics - Dasara Movie Song

ఓరి వారి పాట సాహిత్యం - దసరా

ఓరి వారి.. నీది గాదుర పోరి

ఇడిసేయ్ రా.. ఇంగ.. ఒడిసెను దారి

ఓ పారి.. అవ్వ ఒడిలో దూరి

మరిసేయ్‌రా.. సిన్న.. మొల్లిగ మారి

బాల్యమే గొప్పది.. బాధ మరిశిపోతది

చందమామ రాదనే.. నిజము నమ్మనంటది

సిన్న పల్లి పట్టికే.. యేడుపాపి చూస్తది

కోడె ఈడు సెడ్డది.. నిజాన్ని కోడై కూస్తదీ

ఓరి వారి.. నీది గాదుర పోరి

బజ్జోరా.. సంటి బిడ్డగ మారి

హొ.. హొహొహొ.. హొహొహొ.. హొహొహొ..

హొ.. హొహొహొ.. హొహొహొ.. హొహొహొ..

హొ.. హొహొహొ.. హొహొహొ.. హొహొహొ..

హొ.. హొహొహొ.. హొహొహొ.. హొహొహొ..

ప్రేమ నాలో దాచినా.. చిన్న బొడ్డెమ్మగానే గావురంగా

నిన్ను నేనే వద్దనీ.. గిరిగీసుకున్న గింత దెల్వకుంటా

రగిలి నా వేదెనే.. దీపమోలె వెట్టినా

పేర్చినా బతుకమ్మనే.. కన్నీళ్ళలో సాగదోలినా

ఇడిచేసి వదిలేశినా

రెక్కలిరిగినట్టి ఈగ.. సుడిగాలిలో చిక్కినట్టు

దిక్కు మొక్కు లేని కన్ను.. ఎక్కి ఎక్కి ఏడ్సినట్టు

నీకు దగ్గరవ్వలేక.. దూరమయ్యే దారి లేక.. చితికిపోయె నా బతుకిలా

గుండె పుండు మీద.. గొడ్డు కారమద్ది గుద్దుతుంటే.. గుక్క పట్టి యేడ్వలేని జన్మా

More from Dasara

All songs from Dasara

More by Santhosh Narayanan

All songs by Santhosh Narayanan