Nanna Nuv Naa Pranam Lyrics - Animal Movie Song
నాన్నా నువు నా ప్రాణం పాట సాహిత్యం - ఆనిమల్
నా సూర్యుడివి.. నా చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే
నా కన్నులకి.. నువ్వు వెన్నలవి.. నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా.. నువ్వే కదా.. సితార.. నా కలకీ
నాన్నా.. నువు నా ప్రాణం అనినా.. సరిపోదట ఆ మాటా
నాన్నా.. నీకై ప్రాణం ఇవ్వనా.. ఇదిగో ఇది నా మాటా
నిజాన్నెలా.. అనేదెలా.. ఇవ్వాళ నీ ఎదుటా
నీ చేతులలో ఊయలలూగే.. ఆ సంబరం ఇంకెప్పుడూ
నీ భుజములపై తలవాల్చుకునే.. ఆ పండగ నాకెప్పుడూ
క్షణానికో.. సవాలిలా.. జవాబు లేదెప్పుడూ
నాన్నా.. నువు నా ప్రాణం అనినా.. సరిపోదట ఆ మాటా
నాన్నా.. నీకై ప్రాణం ఇవ్వనా.. ఇదిగో ఇది నా మాటా
నిజాన్నెలా.. అనేదెలా.. ఇవ్వాళ నీ ఎదుటా
ఏ కానుకలూ నీ లాలనతో.. సరితూగవు ఇది నిజమూ
నీ సమయముకై ఈ జీవితమే.. చూస్తున్నది పసితనమై
జగాలనే.. జయించినా.. తలొంచి.. నీ వెనకే
నాన్నా.. నువు నా ప్రాణం అనినా.. సరిపోదట ఆ మాటా
నాన్నా.. నీకై ప్రాణం ఇవ్వనా.. ఇదిగో ఇది నా మాటా
నిజాన్నెలా.. అనేదెలా.. ఇవ్వాళ నీ ఎదుటా
ఈ జన్మవనీ.. ఏ జన్మవనీ.. తీరాలి ఋణం మనకీ
పై జన్మకి నువ్వు.. నా నన్న వలే.. వస్తావట నా దరికీ
ఇదే వరం.. ఇదే శుభం.. మనిద్దరి ఈ కథకీ