Telugu Lyrics

Merisaley Merisaley Lyrics - Ardhashathabdam Movie Song

మెరిసెలే మెరిసెలే పాట సాహిత్యం - అర్ధ శతాబ్ధం

మాంగల్యం తంతునానేనా.. మమజీవన హేతునా

అరె మెరిసెలే మెరిసెలే.. మిలమిలమిల మెరిసెలే

కనులలో వెలుగులే.. కలల సిరులుగా

జత కలిసెలే కలిసెలే.. ఇరు మనసులు కలిసెలే

అడుగులే ఒకటిగా.. కలిసి నడవగా

ఆ నింగి మెరిసంది పందిరిగా

ఈ నేల వెలసింది పీఠలుగా

తొలి వలపే.. వధువై నిలిచే

వరుడే.. వరమై రాగా

ఈ జగమే అతిధై మురిసే

మనసే.. మనువై పోగా

ఇక శ్వాసలో.. శ్వాసగా.. కలగలిసిన ఆశగా

ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

ఒక కలలాగ.. కరిగెను దూరం

ఇక జతచేరి.. మురిసెను ప్రాణం

ఒక శిలలాగ.. నిలిచెను గానం

ఒడి గుడిలోనె.. తరిగెను భారం

ఇది కదా.. ఈ.. హ్రుదయములో.. ఒదిగిన ప్రేమ బంధం

ఒక స్వరమై.. తడిమినది.. తనువును రాగ బంధం

గుండె నిండ సందడేదో తెచ్చి..

ఉండిపోయినావె పండగల్లె వచ్చి

పున్నమల్లె.. వెండి వెన్నెలల్లె..

నన్ను అల్లుకోవె రెండు కళ్ళతోటి

జరిగి జరిగి.. కరిగే తొలకరి.. పరువపు జడిగా

యెదపై.. పలికే తడి.. తకతకతక తకదిమిత

ఇక శ్వాసలో.. శ్వాసగా.. కలగలిసిన ఆశగా

ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

గెలిచినదే.. నిను నా ప్రేమా

నిలిపినదే.. లోనా

విడువనులే.. ఇక యే జన్మా

జతపడుతూ.. రానా

ఒక నీడనై నడిపించనా

ఒక ప్రాణమై బ్రతికేయనా

ప్రణయములే.. ఎదురైనా.. చెదరనిదీ ప్రయాణం

చరితలలో.. చదవనివో.. కథ.. మన ప్రేమ కావ్యం

నువ్వు నేను పాడుకున్న పాట..

రంగురంగులున్న జ్ఞాపకాల తోట

నువ్వు నేను ఏకమైన చోట..

మబ్బులంటు లేని చందమామ కోట

నువ్వు నా సగమై.. జగమై.. ఉదయపు తొలి కిరణములా

వెలుగై తగిలే.. నులి జిలిబిలి తలుకుల తరగలుగా

ఇక శ్వాసలో.. శ్వాసగా.. కలగలిసిన ఆశగా

ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

ఆ నింగి మెరిసంది పందిరిగా

ఈ నేల వెలసింది పీఠలుగా

తొలి వలపే.. వధువై నిలిచే

వరుడే.. వరమై రాగా

ఈ జగమే అతిధై మురిసే

మనసే.. మనువై పోగా

ఇక శ్వాసలో.. శ్వాసగా.. కలగలిసిన ఆశగా

ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

More from Ardhashathabdam

All songs from Ardhashathabdam

More by Shankar Mahadevan

All songs by Shankar Mahadevan