Telugu Lyrics

Manasa Vinava Lyrics - Nootokka Jillala Andagadu Movie Song

మనసా వినవా పాట సాహిత్యం - నూటొక్క జిల్లాల అందగాడు

ఊహలకందని వెన్నెల చూశా.. నీ వల్లేగా

ఆశకి రెక్కలు కట్టుకు ఎగిరా.. ఆనందంగా

కలలే చెరిపి వదిలేశావా.. నను ఒంటరిగా

ఎందుకే.. ఇలా.. ఇలా

హాయిని కొంచెం.. చవిచూపించి.. తరిమేశావా

వెలుతురునంతా.. నీతో తీసుకువెళుతున్నావా

ఎప్పటిలాగే కన్నుల ముందర.. చీకటి తోవా

ఎందుకే.. ఇలా.. ఇలా

నువ్వాడే ప్రతి మాటా.. నిజమేనని నమ్మేశా

ఏమార్చావందంగా.. మనస్సే

కళ్ళారా చూశాకా.. కాదనుకోమంటావా

తెరిపించావీరోజే.. కనులే

తెచ్చిపోసుకుంటూ.. నీ చుట్టు చీకటినీ

వెన్నెలేది అంటూ.. అడగొద్దే రాతిరినీ

నీ చేతులతో.. నిన్నే నువ్వు చెరిపేశాకా

నన్నంటే.. ఎలా.. ఎలా

కనిపించని నిజమైనా.. దాచాలనుకున్నానా

ముసుగేసి కప్పిందీ.. భయమే

నిను చూసిన ప్రతిసారి.. అది నాకు తొలిసారీ

ఆ క్షణమే.. దాచిందీ నిజమే

కంటిపాపతోనూ.. కనురెప్పే తలపడితే

అంతకన్న వేరే అన్యాయం ఉండదులే

చెక్కిలి తాకని ఒక తడి గీతం.. వినబడలేదా

మనసా మనసా.. వినవా వినవా

నా మదిలో మాటే వినవా

మనసా మనసా.. వినవా వినవా

నా మదిలో మాటే వినవా

More by Sreerama Chandra Mynampati

All songs by Sreerama Chandra Mynampati