Kanula Chatu Meghama Lyrics - Phalana Abbayi Phalana Ammayi(PAPA) Movie Song
కనుల చాటు మేఘమా పాట సాహిత్యం - ఫలాన అబ్బాయి ఫలాన అమ్మాయి
Year
Singer
Music
Lyricist
Actor
Actress
Director
కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా
వెనుకరాని నీడతో.. రాయభారమా
మసక మసక.. తడిమి తడిమి.. జ్ఞాపకాలలో
తలచి తలచి.. ఉలికి పడకు.. కాని వేళలో
కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా
వెనుకరాని నీడతో.. రాయభారమా
ఎంత చేరువైనా.. దూరముంటుందనీ
ఎదుటపడిన వేళా.. నాకు తెలిసిందనీ
గుబులు పడిన.. దిగులునడుగు.. భారమెంతనీ
కలిసి విడిన.. అడుగునడుగు.. దూరమెంతనీ
కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా
వెనుకరాని నీడతో.. రాయభారమా
నువ్వు లేని చోటా.. దారి ఆగిందనీ
కాలమాగిపోయీ.. నిన్ను వెతికిందనీ
కురిసి కురిసి.. వెలిసిపోయే.. వాన విల్లునీ
కొసరి కొసరు.. అడుగుతున్న.. బాటసారినీ
కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా
వెనుకరాని నీడతో.. రాయభారమా