Enno Ratrulostayi Gani Lyrics - Amigos Movie Song
ఎన్నో రాత్రులొస్తాయి పాట సాహిత్యం - అమిగోస్
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా
అన్నాడే చిన్నోడూ అన్నిట్లో ఉన్నోడూ
ఆహా..
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా
ఎన్ని మోహాలు మోసీ.. ఎదలు దాహాల దాచా
పెదవి కొరికే.. పెదవి కొరకే
నేనెన్ని కాలాలు వేచా.. ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే.. మరుల సుడికే
మంచం ఒకరితో అలిగినా.. మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా.. సాయం వయసునే అడిగినా
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా
గట్టి ఒత్తిళ్ళ కోసం.. గాలి కౌగిల్లుతెచ్చా
తొడిమ తెరిచే.. తొనల రుచికే
నీ గోటిగిచ్చుల్ల కోసం.. మోక్కచెక్కిల్లు ఇచ్చా
చిలిపి పనులా.. చెలిమి జతకే
అంతే ఎరుగనీ అమరికా.. ఎంతో మధురమే బడలికా
చీ పో బిడియమా సెలవికా.. నాకీ పరువమే పరువికా
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా
అన్నాడే చిన్నోడూ అన్నిట్లో ఉన్నోడూ
ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఆహా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా
More by S. P. B. Charan
Bujjikondave Lyrics - Saindhav Movie Song
బుజ్జికొండవే పాట సాహిత్యం - సైంధవ్
Saindhav · 2023
Manmadha - Kadanna Preme Song - Lyrics
Manmadha - Kadanna Preme Song - Lyrics
Manmadha · 2004
Nuvvu Nenu - Priyatama O Priyatama Song - Lyrics
Nuvvu Nenu - Priyatama O Priyatama Song - Lyrics
Nuvvu Nenu · 2001
Yuvakudu - Maikam Kadidi Song - Lyrics
Yuvakudu - Maikam Kadidi Song - Lyrics
Yuvakudu · 2000
Murari - Ekkada Ekkada Song - Lyrics
Murari - Ekkada Ekkada Song - Lyrics
Murari · 2001