Emantaaro Naaku Lyrics - Gudumba Shankar Movie Song
ఏమంటారో నాకు పాట సాహిత్యం - గుడుంబా శంకర్
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపోతున్న కథనీ
ఏమంటారో జారిపోతున్న మదినీ
చూసే పెదవినీ.. మాటాడే కనులనీ
నవ్వే నడకనీ.. కనిపించే శ్వాసనీ
ఇచ్చి పుచ్చుకున్న మనసునీ..
ఇదా అదా యదా విధా మరి..
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపోతున్న కథనీ
ఏమంటారో జారిపోతున్న మదినీ
ఎదురుగా వెలుగుతున్నా నీడనీ
బెదురుగా కలుగుతున్నా హాయినీ..ఒహూ
తనువునా తునుకుతున్న చురుకునీ
మనసునా ముసురుకున్న చెమటనీ
ఇష్ట కష్టాలనీ(ఏమంటారో).. ఇపుడేమంటారో
ఈ మోహమాటాలనీ(ఏమంటారో).. మరి ఎమంటారో
స్వల్ప భారాలనీ(ఏమంటారో).. ఇపుడేమంటారో
సమీప దూరాలనీ(ఏమంటారో).. అసలేమంటారో
జారే నింగినీ.. దొరలాంటీ దొంగనీ
తాడే కొంగునీ.. పరిమళించే రంగునీ
పొంగుతున్న సుధా గంగనీ
ఇదా అదా అదే ఇదా మరీ..
ఏమంటారో మారిపోతున్న కథనీ
ఏమంటారో జారిపోతున్న మదినీ
జాబిలై.. తలుకుమన్న చుక్కనీ
బాధ్యతై.. దొరుకుతున్న హక్కునీ.. హేయ్ హేయ్
దేవుడై.. ఎదుగుతున్న భక్తునీ
సూత్రమై.. బిగయనున్న సాక్షినీ
పాతలో.. కొత్తనీ.. ఇపుడేమంటారో
పోట్లాటలో.. శాంతినీ.. మరి ఏమంటారో
తప్పులో ఒప్పునీ(ఏమంటారో).. ఇపుడేమంటారో
గత జన్మలో.. అప్పునీ(ఏమంటారో) అసలేమంటారో
నాలో నువ్వునీ.. ఇక నీలో నేనునీ
మాకేమేమనీ.. మన దారే మనదనీ
రాసుకున్న ఆత్మ చరితనీ
అదా ఇదా ఇదే అదా మరీ..
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపోతున్న కథనీ
ఏమంటారో జారిపోతున్న మదినీ
More from Gudumba Shankar
All songs from Gudumba Shankar →More by S. P. B. Charan
Bujjikondave Lyrics - Saindhav Movie Song
బుజ్జికొండవే పాట సాహిత్యం - సైంధవ్
Saindhav · 2023
Manmadha - Kadanna Preme Song - Lyrics
Manmadha - Kadanna Preme Song - Lyrics
Manmadha · 2004
Nuvvu Nenu - Priyatama O Priyatama Song - Lyrics
Nuvvu Nenu - Priyatama O Priyatama Song - Lyrics
Nuvvu Nenu · 2001
Yuvakudu - Maikam Kadidi Song - Lyrics
Yuvakudu - Maikam Kadidi Song - Lyrics
Yuvakudu · 2000
Murari - Ekkada Ekkada Song - Lyrics
Murari - Ekkada Ekkada Song - Lyrics
Murari · 2001