Telugu Lyrics

Ee Raathale Lyrics - Radhe Shyam Movie Song

ఈ రాతలే పాట సాహిత్యం - రాధే శ్యామ్

ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా

ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా

వీరి దారొకటే.. మరి దిక్కులే.. వేరులే

ఊపిరొకటేలే.. ఒక శ్వాసలా.. నిశ్వాసలా

ఆటాడే విధే.. ఇదా ఇదా.. పదే పదే

కలవడం.. ఎలా ఎలా.. కలా

రాసే ఉందా.. రాసే ఉందా

ఈ రాతలే.. దోబూచులే

ఈ రాతలే.. దోబూచులే

ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా

ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా

ఖాళీఖాళీగున్న ఉత్తరమేదో..

నాతో ఏదో కథ చెప్పాలంటోందే

యే గూడాచారో.. గాఢంగ నన్నే..

వెంటాడేను ఎందుకో.. ఎమో

కాలం మంచు కత్తి.. గుండెల్లో గుచ్చే

గాయం లేదు గాని.. దాడెంతో నచ్చె

ఆ మాయే ఎవరే.. రాదా ఎదురే

తెలీకనే తహ తహ పెరిగే

నిజమా భ్రమా.. బాగుంది యాతనే

కలతో కలో.. గడవని గురుతులే

ఏదో జన్మ బాధే.. పోదే.. ప్రేమై రాదే

ఈ రాతలే.. దోబూచులే

(ఈ రాతలే.. దోబూచులే)

యే గూడాచారో.. గాఢంగ నన్నే..

వెంటాడేను ఎందుకో.. ఎమో

(ఈ రాతలే.. దోబూచులే)

ఆ మాయే ఎవరే.. రాదా ఎదురే

తెలీకనే తహ తహ పెరిగే

ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా

ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా

More from Radhe Shyam

All songs from Radhe Shyam

More by Yuvan Shankar Raja

All songs by Yuvan Shankar Raja