Devi Kalyana Vaibogame Lyrics - Vivaha Bhojanambu Movie Song
దేవి కళ్యాణ వైభోగమే పాట సాహిత్యం - వివాహ భోజనంబు
Movie
Year
Singer
Music
Lyricist
Actor
Actress
Director
దేవి కళ్యాణ వైభోగమే.. నాధ కళ్యాణ వైభోగమే
సీతా కళ్యాణ వైభోగమే.. రామా కళ్యాణ వైభోగమే
నీల మేఘ శ్యామ రామ సుందరం
సీతాపతి రామ ప్రేమ మందిరం
మోహనాంగ రఘువంశ కులదామ
మృదువదనా.. చంద్రకిరణా
సన్నాయి మేళాలు మోగినవే
అమ్మాయి నవ్వుల్లో చేరినవే
ఆకాశమే నేడు తారలనే
అక్షింతలై పైన జల్లినదే
కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనసు పడుతు తాళి కట్టగా
ఒకరి ఒకరై ఇక మారె జతగా
అడుగుల్లొ అడుగేసి సాగదుగా.. తుంటరి కృష్ణుడు
బ్రతిమాలి అడిగితే చాలు కదా.. ప్రాణమై రుక్మిణీ
పులిహోర పరమాన్నం.. పిలిచాయి పదమంటూ
కడుపార వింధారగించి బయలుదేరగా
సన్నాయి మేళాలు మోగినవే
అమ్మాయి నవ్వుల్లో చేరినవే
ఆకాశమే నేడు తారలనే
అక్షింతలై పైన జల్లినదే
కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనసు పడుతు తాళి కట్టగా
ఒకరి ఒకరై ఇక మారె జతగా