Devathala Lyrics - Nenu Movie Song
దేవతలా నిన్ను చూస్తున్నా పాట సాహిత్యం - నేను
దేవతలా నిన్ను చూస్తున్నా.. దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువ్వు తీస్తున్నా.. నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా.. నువ్వెవరమ్మా
ఇంతకీ.. నాకు నువ్వెవరమ్మా
ఎగిరి ఎగిరి పోయింది సీతాకోకచిలకా
మిగిలింది వేళ్ళపై అది వాలిన మరకా
ఎగిరి ఎగిరి పోయింది సీతాకోకచిలకా
మిగిలింది వేళ్ళపై అది వాలిన మరకా
ఆరారో.. ఆరారో
ఆరారో.. ఆరారో
దేవతలా నిన్ను చూస్తున్నా.. దీపంలా జీవిస్తున్నా
సుడి గాలికి చిరిగిన ఆకు అలగదూ..
చెలి చూపుకు నలిగిన మనసు మరవదూ..
నీ ఒడిలో చెరలేని నా ఆశలో..
ఒడిదుడుకుల వుడుకెత్తిన నా శ్వాసలో
ఎండమావిలో సాగే పూల పడవలూ
గుండె దాచుకోలేని తీపి గొడవలూ
అందీ అందని దానా అందమైన దానా
అంకితం నీకే అన్నా.. నను కాదన్నా
ఆరారో.. ఆరారో
ఆరారో.. ఆరారో
దేవతలా నిన్ను చూస్తున్నా.. దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువ్వు తీస్తున్నా.. నీ ధ్యానం నే చేస్తున్నా
నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పూ..
నెమలి కన్ను.. మనసు చూడలేదని చెప్పూ
నీ వెన్నెల నీడలైన నా ఊహలూ..
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులూ..
ఈ సమాధిపై పూసే సన్న జాజులూ
నిదర రాని నిట్టూర్పుల జోల పాటలూ
చక్కనైన చినదానా.. దక్కని దానా
రెక్కలు కట్టుకు రానా.. తెగిపోతున్నా
ఆరారో.. ఆరారో
ఆరారో.. ఆరారో