Telugu Lyrics

Daare Leda Lyrics - Dedicated to Frontline Warriors

దారే లేదా పాట సాహిత్యం

మబ్బే కమ్మిందా.. లోకం ఆగిందా

మాతో కాదంటూ.. చూస్తూ ఉండాలా?

దారే లేదా?

గాలే భయమైందా.. శ్వాసే కరువైందా

యుద్ధం చేస్తున్నా.. శత్రువు దూరంగా

పోనే పోదా?

మా గొంతే దిగనందే.. ఓ ముద్దైనా ఈ శోకంతో

మా కంటిరెప్పేమో.. నిద్రే పోదే

దేవుళ్ళం అంటారే.. ఊపిరి పోతే చూస్తూ ఉన్నా

ప్రాణాలే కాపాడే వీలే లేదే

చరిత్రలో సమాధులేగా.. ఇలాంటి ఈ ఉపద్రవాలే

సమిష్టిగా జయించలేవా.. ఓ హో ఓ ఓ

కొన్నాళ్ళకీ గతం ఇదేగా

ఇదే క్షణం గడుస్తు పోదా

పోరాడదాం పోయేటి దాక.. హా ఓ ఓ

శోకం దిగమింగే.. ఆశే బ్రతికించే.. పాడాలి ముగింపే

ధైర్యాలను నింపే.. చేద్దాం తెగదేంపే.. దూరాలకు పంపే

మా చదువులనే.. నిలదీస్తుందా

మా అనుభవమే వెలివేస్తుందా

మరి నిర్లక్ష్యం పనికొస్తుందా

ఇది విశ్వాన్నే.. బలిచేస్తుందా.. తొలిచేస్తుందా

చరిత్రలో సమాధులేగా.. ఇలాంటి ఈ ఉపద్రవాలే

సమిష్టిగా జయించలేవా.. ఓ హో ఓ ఓ

కొన్నాళ్ళకీ గతం ఇదేగా

ఇదే క్షణం గడుస్తు పోదా

పోరాడదాం పోయేటి దాక.. హా ఓ ఓ

ముందుండే సైన్యం.. పెడుతుంటే ప్రాణం..

చూస్తూ ఉందామా? మనమేం చేయలేమా?

మాటే విందామ? భద్రంగుందామా?

ముసుగే వేద్దామా? తరిమే కొడదామా?