భరత వేదముగ పాట సాహిత్యం - పౌర్ణమి
శంభో శంకర
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
తద్ధింతాధిమి ధింధిమీ పరుల తాండవకేళీతత్పరా
గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకరా
భరత వేదముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశా
నీలకంఠరా జాలిపొందరా.. కరుణతొ ననుగనరా
నీలకంఠరా శైలమందిరా.. మొర విని బదులిడరా
నగజామనోజ జగదీశ్వరా.. మాలేందుశేఖరా శంకరా
భరత వేదముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశా
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
అంతకాంత నీ సతి.. అగ్నితప్తమైనది
నేను త్యాగమిచ్చి.. తాను నీలో లీలమైనదీ
ఆదిశక్తి ఆకృతి.. అద్రిజాత పార్వతి
తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నదీ
భవుని భువుకి తరలించేలా.. ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీ లీలా.. యతిని నృత్య రతులు చేయగలిగే.. ఈ వేళా
భరత వేదముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశా
జంగమ సావర గంగాచ్యుత శిర భృత మండిత కరమురహరా
భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వరా
ఆశుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా
హర హర మహాదేవ
హర హర మహాదేవ
వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమనినా
హే మహేశ నీ భయదపదాహతి దైత్య శోషణము జరుపంగా
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోనా
నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా
పలుకుతున్న ప్రాణానానా ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా
హర హర మహాదేవ
More from Pournami
All songs from Pournami →More by Devi Sri Prasad
Bharatha Vedamuga Lyrics - Pournami Movie Song
Bharatha Vedamuga Lyrics - Pournami Movie Song
Pournami · 2006
Maharshi - Choti Choti Baatein Song - Lyrics
Maharshi - Choti Choti Baatein Song - Lyrics
Maharshi · 2019
Attarintiki Daredi - Ninnu Chudagaane Song - Lyrics
Attarintiki Daredi - Ninnu Chudagaane Song - Lyrics
Attarintiki Daredi · 2013
Nannaku Prematho - Nannaku Premato Title Song - Lyrics
Nannaku Prematho - Nannaku Premato Title Song - Lyrics
Nannaku Premato · 2016
1: Nenokkadine - Who are you? Song - Lyrics
1: Nenokkadine - Who are you? Song - Lyrics
1: Nenokkadine · 2014